బనగానపల్లెలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. బనగానపల్లె-డోన్ రోడ్డులోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, పట్టణ ట్రాపిక్ సమస్యను తీర్చే బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు. పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో ప్రభుత్వాసుపత్రిలో కొత్తగా నిర్మిస్తోన్న అన్న క్యాంటీన్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.