అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అనుబంధంగా కొనసాగుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడి పల్లి గ్రామానికి చెందిన బోయ వీరేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల మూడవ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.