కుప్పం: ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన
కుప్పం నియోజకవర్గంలో రైతులు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రైతు సాధికార సంస్థ ఏపీ ప్రకృతి వ్యవసాయ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీరజ పరిశీలించారు. రైతులు సాగు చేస్తున్న పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల వినియోగం పెరగాలని.. అది సాగుతోనే సాధ్యమవుతుందని రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు.