నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి నందు స్నేహితుడు నితిన్ తో కలిసి బైక్ పై శుక్రవారం కురుమూర్తి జాతరకు వెళుతుండగా చిన్న చింతకుంట మండలం గూడూరు గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొన్నారు. ఆపై ట్రాక్టర్ ట్రాలీ ఢీ కొనడంతో నందు మృతి చెందాడు. నితిన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయపడిన నితిన్ ను జిల్లా ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు.