గజ్వేల్: సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్, ఉప సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జగదేవ్ పూర్ మండలం పలుగుగడ్డ గ్రామస్తులు
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం పలుగుగడ్డ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బుధవారం గ్రామస్తులంతా తీర్మానించుకున్నారు. అలాగే ఎన్నికల సమయం లో 8 వార్డులకు సభ్యులను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు.పలుగుగడ్డ గ్రామంలో అందరూ ఒకే సామాజిక వర్గం వారు నివసిస్తుండగా, బుధవారం గ్రామస్తులంతా కలసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాభివృద్ధికి ఎవరు సహకరిస్తే వారే సర్పంచ్, ఉపసర్పంచ్లు ఉండాలని తీర్మానించుకున్నారు. ఊరిలో దేవాలయాల నిర్మాణానికి పది గుంటల భూమి ఇవ్వాలని, అలాగే అభివృద్ధికి సహకరించాలని నిబంధనలు విధిం చారు. దీంతో కనకయ్య, రాజ్కుమార్, రవి, ఐ