బద్వేల్: కాశినాయన : కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి - టిడిపి మండల నాయకుడు రోహిత్ రెడ్డి
Badvel, YSR | Jul 15, 2025 కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలం రెడ్డి కొట్టాల గ్రామంలో మంగళవారం టిడిపి మండల నాయకుడు రోహిత్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో ముచ్చటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగిస్తున్నారన్నారు.