పాణ్యం: కల్లూరు మండలంలో ‘రైతన్నా మీకోసం’ వర్క్‌షాప్ రైతులతో సంభాషించిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలోని రైతు–సేవా కేంద్రంలో బుధవారం జరిగిన ‘రైతన్నా–మీకోసం’ వర్క్‌షాప్‌లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. రైతులతో మాట్లాడిన ఆమె ఆధునిక సాగు విధానాలు, పంట సంరక్షణ, నాణ్యమైన విత్తనాల ప్రాముఖ్యతపై సూచనలు ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలని సూచించారు.