హిమాయత్ నగర్: పద్మారావు నగర్ స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
పద్మారావు నగర్ అభినవ్ నగర్ కమిటీ హాల్లో అధికారులు కాలనీవాసులు సమస్యల పరిష్కారం కోసం సమావేశాన్ని ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కాలనీవాసులు పలు సమస్యలను విన్నవించారు. ప్రధాన రహదారుల మీద గుంతలు పడి అధ్వానంగా మారాయని ఎమ్మెల్యేకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ త్వరలోనే మరమ్మతులు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. అభినవ్ నగర్ లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.