భూపాలపల్లి: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్షపతి గౌడ్
టేకుమట్ల మండలం గత మూడు ,నాలుగు రోజులుగా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీల తీరును ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వినతిపత్రం అందించినట్లు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్షపతి గౌడ్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు పొన్నం బిక్షపతి గౌడ్.