కుప్పం: నడుమురు మార్కెట్ కమిటీ చెక్ పోస్టును తనిఖీ చేసిన ఏఎంసి చైర్మన్ జిఎం రాజు
కుప్పం మండలం నడుమూరు AMC చెక్ పోస్ట్‌ను AMC ఛైర్మన్ GM రాజు ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ చెక్ పోస్ట్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వాహన రాకపోకలకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. చెక్ పోస్ట్‌లో ఉంటున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏవైనా అవినీతి ఆరోపణలు వస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.