సలకం చెరువు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సలకం చెరువు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఆదినారాయణ అనే పెద్దవడుగూరు మండలం చిట్టూరు గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.