మునగపాక మండలం నాగులాపల్లిలో మరమ్మతుల కోసం ఉంచిన వ్యవసాయ మోటార్ల చోరీ: ఎస్సై పి.ప్రసాదరావు
మునగపాక మండలం నాగులాపల్లిలో వ్యవసాయ మోటార్లు చోరీకి గురయ్యాయి. మరమ్మతులకు గురైన మోటార్లను తీసుకువచ్చిన రైతులు, గ్రామంలోని ఓ షాపులో ఉంచారు. దుకాణంలో ఉన్న వీటిని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. శనివారం చోరీ విషయాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.