మణుగూరు: రాయపాడు గ్రామంలో ఇష్టం లేని పెళ్లి చేస్తారేమోనని యువతి ఆత్మహత్యాయత్నం
ఆళ్ళపల్లి మం. రాయపాడు గ్రామానికి చెందిన 19 సం. ల నందిని అనే యువతికి ఇంట్లో కొద్ది రోజులుగా వివాహం చేస్తామని కుటుంబీకులు చెప్పడంతో మనస్తాపం చెందిన యువతి మూడు రోజుల నుండి భోజనం మానేసి, బుధవారం మోనో మందు తాగింది.మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆళ్లపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి, తర్వాత మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెంకు తరలించారు.