బాలాపూర్: సరూర్ నగర్ లో వేసవి సందర్భంగా విద్యుత్ సరఫరా లో లోపాలు లేకుండా చేపట్టిన ఏర్పాట్లు సమీక్షించిన సీఎండీ ఫారూఖ్
రానున్న వేసవి కాలంలో పెరగనున్న డిమాండ్ కు తగ్గట్టు విద్యుత్ సరఫరా కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ తగు చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వేసవి సన్నాహక చర్యల్లో భాగంగా జరుగుతున్న పనులను తనిఖీ చేసారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం లో వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు