పలమనేరు: తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను నాయకులు కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడు, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.