ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఓ కాంప్లెక్స్ లో డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రికవరీ ఏజెంట్లకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఆర్.బి.ఐ నిబంధనల అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రుణవస్తుల్లో సమయంలో ఖాతాదారులను భౌతికంగా లేదా మౌఖికంగా బెదిరించడం వేధించడం వంటి చర్యలు తీసుకునే ఏజెంట్ల పై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఉదయం ఎనిమిది గంటల ముందు సాయంత్రం ఏడు గంటల తర్వాత ఫోన్లో చేయడం నిషేధించడం జరిగిందన్నారు