ఫరూక్ నగర్: కేశంపేట మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ సీజ్
కేశంపేట మండల కేంద్రంలో పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు కేశంపేట ఎస్సై లింగం తెలిపారు. తమ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పెద్దవాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. కానిస్టేబుల్ భీమరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.