ప్రొద్దుటూరు: మున్సిపల్ గాంధీ పార్కులో మాంసాహార విక్రయాలపై కమిషనర్ చర్యలు తీసుకోవాలి
Proddatur, YSR | Nov 20, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ గాంధీ పార్కులోని క్యాంటీన్లో మాంసాహారం విక్రయిస్తున్నారు. మాంసాహారం విక్రయించడంపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు గురువారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. లీజు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. లీజుకు రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.