భూపాలపల్లి: బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పాతూరి రాజిరెడ్డి మృతి చెందడంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు కొంపెల్లి గ్రామంలో మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే, గ్రామానికి చెందిన పసుల పుచ్చయ్య మృతి చెందడంతో కార్యకర్త చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడవద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.