అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని మడుగు పల్లి హిల్స్ వద్ద అరటికాయల లోడుతో వెళుతున్న ఐచర్ వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన వారిలో రాహుల్, రవి, సుహిధర్ అనేవారు ఉన్నారు. వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.