బద్వేల్: బద్వేల్ : హెడ్ కానిస్టేబుల్ అనారోగ్యంతో మృతి
Badvel, YSR | Jul 12, 2025 కడప జిల్లా బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతుకూరి లక్ష్మీనారాయణ (53) శనివారం అనారోగ్యంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో రిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడన్నారు. మృతుడు లక్ష్మీనారాయణ కమలాపురంలో నివాసం ఉండేవాడని ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వహించారు.హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతి పట్ల పలువురు పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.