కళ్యాణదుర్గం నుంచి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలి వెళుతున్నది. గత కొన్ని నెలలుగా ఈ తంతు కొనసాగుతున్నది. కొందరు స్వార్ధపరులు ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్లలో కర్ణాటక కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలుసార్లు స్థానికులు అడ్డగించడం జరిగింది. అయినప్పటికీ ఇసుక తరలి వెళుతూనే ఉన్నది. సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమంగా తరలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోజూ రాత్రి వేళ ఇసుక అక్రమంగా తరలి వెళుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.