కోదాడ: కోదాడ పట్టణంలో సెక్టార్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు
Kodad, Suryapet | Apr 22, 2024 జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సెక్టార్ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పోలింగ్ బూత్ లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.