కనిగిరి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ వీధిలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కనిగిరి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ వీధిలో నివాసం ఉంటున్న గాదంశెట్టి ఇందిరా కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఇందిరా ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.