బీబీ నగర్: బీబీనగర్ మండలం రంగాపురం సమీపంలోని నీటిని తొలగించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురం సమీపంలోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో రోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చంద్రారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నిలిచిన నీటిలోనే నిలబడి నిరసన తెలిపారు. అధికారులు చర్యలు తీసుకొని నీటిని ఆరాదూలాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.