ప్రొద్దుటూరు: సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకున్న పోలీసులు.. ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్లు బాధితుల ఆవేదన
Proddatur, YSR | Nov 23, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు తమ హద్దులు మీరి వ్యవహరించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకున్న పోలీసులు, ఇద్దరు అన్నదమ్ములను కిడ్నాప్ చేసి, నిర్బంధించి, చితకబాదడమే కాక, ఏకంగా ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బాధితులు తనకంటి శ్రీనివాసులు, ఆయన తమ్ముడు తనకంటి వెంకటేశ్వర స్వామి. వీరిద్దరిని వన్ టౌన్ పోలీసులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడి కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్ 21వ తారీఖున సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు ముందుగా తనకంటి వెంకటే