మధిర: ఎర్రుపాలెం మండల ప్రజల దశాబ్దాల కల డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు నెరవేర్చడం హర్షణీయం
ఎర్రుపాలెం మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు కల ఎట్టకేలకు నెరవేరిందని కాంగ్రెస్ మండల నాయకులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఎర్రుపాలెం మండల కేంద్రంలో మాట్లాడుతూ...22 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసారని తెలిపారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని,చిన్నపిల్లల అనారోగ్యం, ఎముకల సమస్యలు, మహిళల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యుల సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం ఖమ్మం లేదా విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగా మెరుగైన వైద్య సేవలు లభించనున్నట్లు పేర్కొన్నారు.