కలికిరి గ్రామ పంచాయతీలో ఇంటి పన్నులు సకాలంలో ఆన్లైన్లోనే చెల్లించాలి: ఈవో అశోక్
కలికిరి గ్రామపంచాయతీలో ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని ఈవో జి.అశోక్ తెలిపారు. సోమవారం ఉదయం బీడీ కాలనీలో ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటి పన్నులు ప్రభుత్వం సూచించిన వెబ్సైట్ లోని స్కానర్ ద్వారా చెల్లించాలన్నారు. చేతికి ఎవరు డబ్బు ఇవ్వరాదని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.