ఆదోని: ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది.
Adoni, Kurnool | Dec 2, 2025 ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం 16వ రోజుకు చేరింది. దీక్షకు ప్రగతిశీల మహిళా సంఘం (పీఎంఎస్) సంఘీభావం తెలిపింది. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర నాయకురాలు మణెమ్మ అన్నారు. ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఆమె పిలుపునిచ్చారు