ఇబ్రహీంపట్నం: షాద్నగర్ పట్టణంలో 21 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్ పట్టణంలో 21 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా స్పందించిన నాడే అన్ని వార్డులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో నాణ్యతలేని రోడ్డు పనులు చేపట్టి కొన్ని కాలనీలలో సిసి రోడ్లు తెల్లబోయాయని తెలిపారు. షాద్నగర్ పట్టణాన్ని షాన్ దార్ నగర్ గా మారుస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.