బద్వేల్: సెంట్రల్ కిచెన్ పేరుతో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిస్తే ప్రభుత్వ పతనం తప్పదు: భోజన కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు
Badvel, YSR | Jul 12, 2025 కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కలసపాడు మండలం లోని మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలపై సెంట్రల్ కిచెన్ పేరుతో కార్మికులను తొలగిస్తే, ప్రభుత్వం పతనం తప్పదని జిల్లా గౌరవ అధ్యక్షుడు చాంద్ భాషా, సిపిఐ మండల కార్యదర్శి గుడిని సునీల్ కుమార్ లు తెలిపారు.శనివారం కలసపాడు మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై నరసయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భోజన కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చాంద్ భాష, సిపిఐ మండల కార్యదర్శి సునీల్ కుమార్ లు పాల్గొని ప్రసంగించారు.