2 రోజుల క్రితం రాయదుర్గం పట్టణంలోని గోల్డ్ షాపులో జరిగిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది పక్కా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. రాయదుర్గం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ జయనాయక్ కోరారు. గోల్డ్ షాపు, బ్యాంక్ లు, కమర్షియల్ షాపుల వద్ద సిసి కెమెరాల పర్యవేక్షణతో పాటు వాచ్ మెన్ ఉండేలా చూసుకోవాలి తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వెళితే ముందే పోలీసు స్టేషన్ లో తెలిపాలన్నారు. స్థానిక యువత అప్రమత్తంగా ఉండి రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమినిత వ్యక్తుల సంచారం తెలిపాలన్నారు.