ఆదోని: తహశీల్దార్ ను తల నరుకుతానని, ఫోన్లో బెదిరించిన ఓ మహిళ నాయకురాలి పై చర్యలు తీసుకోండి :MHPS రాష్ట్ర కార్యదర్శి నూరు
Adoni, Kurnool | Jul 6, 2025 తహశీల్దార్ ను తలనరుకుతానని ఫోన్లో బెదిరించిన, ఆదోనికి చెందిన ఓ మహిళా నాయకురాలిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపించిన, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఇలాంటి నాయకులను ప్రభుత్వం ఉపేక్షించరాదు. ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఆదోనికి చెందిన ఒక మహిళా నాయకురాలు తాసిల్దారును నేను చెప్పిన వారికే రేషన్ బియ్యం ఇవ్వకపోతే తలలు తెగుతాయని, హెచ్చరించడం చాలా దుర్మార్గము. ఇలాంటి ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం గల నాయకులను ప్రభుత్వం ప్రోత్సహించరాదని ఎమ్.హెచ్.పి.యస్. తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.