ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మర్రిపూడి మండలంలోని గుండ్ల సముద్ర గ్రామానికి చెందిన నాగార్జున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి భౌతిక దేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.