కొల్లాపూర్: కోడేరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత, కేసు నమోదు ఎస్సై కురుమూర్తి
కోడేరు మండల పరిధిలో పిడిఎఫ్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఆటోను సీజ్ చేసినట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. మండలంలో తనిఖీల్లో భాగంగా శుక్రవారం వాహనాలను తనిఖీ నిర్వహిస్తుండగా 7 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గోపాల్పేటకు చెందిన ఆటో డ్రైవర్ దేవరాజు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.