అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో సోమవారం మూడు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఆరు మండలాలకు సంబంధించిన 26 మందికి 41,95,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్బిదారులకు పంపిణీ చేయడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు టిడిపి నేతలు పాల్గొన్నారు.