పూతలపట్టు: పూతలపట్టు నియోజకవర్గం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీలు
పూతలపట్టు. బంగారుపాలెం, యాదమరి మండలాలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది పూతలపట్టు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక బంగారుపాలెం డాక్టర్ శిరీష యాదమరి డాక్టర్ అనిల్ కుమార్ ఎయిడ్స్ రావడానికి కారణాలు ప్రజలకు వివరించి ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ లక్ష్మీనారాయణ, యాదమరి సిహెచ్ఓ శ్రీనివాసమూర్తి ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహ ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.