బుగ్గారం: ధర్మపురి: బుగ్గారం మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్
15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుగ్గారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెడవెని శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు యశ్వంత్‌రావు పేట గ్రామం నుండి నాలుగు జట్లు రాగా మొదటగా రెండు జట్లకు టాస్ వేసి రెండు జట్ల ప్లేయర్స్ తో బీజేపీ మండల అధ్యక్షుడు మెడవేణి శ్రీధర్ మాట్లాడి ఆట ప్రారంభించారు. వారితోపాటు బుగ్గారం మండల ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గుంటి ఐలెన్, తోట తిరుమల్, ముత్యాల మధు, నీలి అజయ్, చింతల కొమురయ్య, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ యువత పాల్గొన్నారు