కొడంగల్: భూముల విషయంలో రైతులకు జవాబుదారితనాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చింది: పర్సాపూర్లో కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కోడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై అవగాహన నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అబద్ధ భావాన్ని తాగునీయకుండా జవాబు దారితనాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూభారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.