జియో మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ధరలు తగ్గించండి మహాప్రభో అంటూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని జియో కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. జియో కస్టమర్ లకు రీఛార్జ్ రానురానూ భారమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రీ చార్జ్ ధరలు తగ్గించాలని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు.