పలమనేరు: ఎండోమెంట్ అధికారులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. పాతపేట శ్రీ సత్య గంగమ్మ దేవస్థానం అమ్మవారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలను మదనపల్లె డివిజనల్ శాఖ ఇన్స్పెక్టర్ శశి కుమార్ పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది. నాలుగు నెలలకు గాను 1,81,042, రూపాయలు ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ నగదును ఎండోమెంట్ వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో కమలాకర్, దేవస్థానం సిబ్బంది, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.