పత్తికొండ: పత్తికొండ మండలం జొన్నగిరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 13 మందికి జరిమానా
పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13 మంది వాహన చోదకులకు పత్తికొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.