ఒంగోలు: నగరంలో ఎంపీ మాగుంటను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీ రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఐదో జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేయనున్న వార్తల నేపథ్యంలో వీరు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.