గుంతకల్లు: గుత్తి పట్టణ శివారులో 44 నెంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఇమ్రాన్ మృతి
గుత్తి పట్టణ శివారులోని 44 నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుండి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఇమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.