బాల్కొండ: కుకునూర్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
వేల్పూర్ మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలు సంయుక్తంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఎత్తుకున్న బోనాలతో పాఠశాల నుండి గ్రామంలోకి ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద గల కూడలిలో బోనాలను ఉంచి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి అనంతరం నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినిలు బోనాల కు సంబంధించిన జానపద గేయాలతో చక్కని నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుంచే సంస్కృతి, సంప్రదాయలు నేర్చుకో