ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : విద్యుత్ సిబ్బంది భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలి : స్టేషన్ ఘన్ పూర్ లో ఎస్ ఈ వేణుమాధవ్
స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో విద్యుత్ సిబ్బందితో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్ ఈ వేణుమాధవ్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఈ వేణుమాధవ్ మాట్లాడుతూ నిరంతర సేవలు అందించే విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో తడబాటు లేకుండా భద్రత నియమాలను పాటించినట్లయితే ఎలాంటి ప్రమాదాలు జరగవని సిబ్బందికి సూచించారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడితే తొందరపడకుండా ఆలోచించి పని చేయాలన్నారు. సిబ్బంది సేఫ్టీ పరికరాలు ఉపయోగించి మరమ్మతులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ప్రభావతి, డీఈ హుస్సేన్ నాయక్ ఎస్సీఓ జయరాజ్ ఏడీలు సత్యనారాయణ, శ్రీరాం పాల్గొన్నార