ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో 30 వైసీపీ కుటుంబాలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. అదేవిధంగా మండలంలోని వెలిగండ్ల గ్రామంలో 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీ లోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి వైసీపీ కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు