నాగర్ కర్నూల్: అచ్చంపేటలో జిల్లాస్థాయి షూటింగ్ బాల్ సెలక్షన్స్ ఎంపిక
అచ్చంపేట పట్టణంలో ఆదివారం గౌతమి హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి షూటింగ్ బాల్ సెలక్షన్స్ను నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా స్థాయి సెలక్షన్స్ కు 70 మంది క్రీడాకారులు వచ్చారని తెలిపారు.