బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ గంగమ్మ ఆరోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి టీడీపీ నాయకులతో కలిసి సోమవారం నాగిరెడ్డిపల్లి గ్రామానికి వేర్వేరుగా వెళ్లారు. అక్కడ గంగమ్మ మృతదేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. గంగమ్మ మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.