శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వృద్ధులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్న సుశుమందిర్ స్కూల్ సెంటర్ పరిధిలో స్వయంగా ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే, లబ్ధిదారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలను మహిళలకు వివరించారు.చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోనే పెన్షన్లు పెరిగాయని, అభివృద్ధి చేసే నాయకులను గుర్తుంచుకోవాలని తెలిపారు.అనంతరం సున్నిపెంటలో రూ.8 కోట్లతో జరుగుతున్న పనులను పరిశిలించారు.